Share News

TDP: జోరందుకున్న అభివృద్ధి కార్యక్రమాలు

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:32 PM

నియోజకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయని టీడీపీ నాయకుడు గుమ్మనూ రు నారాయణ స్వామి పేర్కొన్నారు. మండలంలోని ఎన వెంకటాంపల్లి లో కదిరప్ప స్వామి దేవస్ధానానికి రహదారి నిర్మాణం కోసం ఎంపీపీ మాధవి, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి శుక్ర వారం భూమిపూజచేసి పనులను ప్రారంభించారు.

TDP: జోరందుకున్న అభివృద్ధి కార్యక్రమాలు
Brahmangari Rathotsavam in splendor

గుంతకల్లు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయని టీడీపీ నాయకుడు గుమ్మనూ రు నారాయణ స్వామి పేర్కొన్నారు. మండలంలోని ఎన వెంకటాంపల్లి లో కదిరప్ప స్వామి దేవస్ధానానికి రహదారి నిర్మాణం కోసం ఎంపీపీ మాధవి, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి శుక్ర వారం భూమిపూజచేసి పనులను ప్రారంభించారు. నారాయణ స్వామి మాట్లాడుతూ రూ. 45 లక్షలతో పెద్ద కదిరప్ప స్వామి దేవాలయానికి రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేయడం హర్షిం చదగ్గ విషయమన్నారు.


రోడ్డు నిర్మాణానికి భూమిని ఇచ్చిన రైతులను అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలారి మస్తానప్ప, రామన్న చౌదరి, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ సభ్యత్వ బీమా సొమ్ము పంపిణీ

గుంతకల్లు: ప్రమాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుం బానికి టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి రూ. 5 లక్షల బీమా సొమ్మును శుక్రవారం అందజేశారు. మండలంలోని కదిరి పల్లికి చెందిన నరేశ అనే కార్యకర్త రూ. 100 చెల్లించి పార్టీ సభ్యత్వాన్ని పొందారు. ప్రమాదవశాత్తూ మరణించడంతో సభ్యత్వానికి ఉన్న రూ. 5 లక్షల ప్రమాద బీమాసొమ్మును ఆయన కుమారుడు గిలక కరిరప్ప ఖాతాకు జమచేశారు. అలాగే అయ్యవారిపల్లికి చెందిన నరసింహులు నాయక్‌ మృతిచెందడంతో ఆయన భార్య ఎస్‌ దేవి ఖాతాకు రూ. 5 లక్షలు జమచేశారు. ఈ రెండు కుటుంబాల సభ్యులను కలసిన నారా యణ స్వామి కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలు స్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమణ చౌదరి, శివశంకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 27 , 2026 | 11:32 PM