RATION: అందని రేషన
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:43 PM
గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ రేషనషాపుల్లో నిత్యవసర సరుకులు ఇచ్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక షాపుల్లోనే సబ్సీడీపై నిత్యావసర సరుకులను పంపిణీ ప్రారంభించి, ప్రజల మన్ననలను పొందుతోంది.
- ఇష్టారాజ్యంగా పలువురు డీలర్ల వ్యవహారం
- నిత్యవసర సరుకులు అందక లబోదిబోమంటున్న కార్డు దారులు
పుట్లూరు, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ రేషనషాపుల్లో నిత్యవసర సరుకులు ఇచ్చిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక షాపుల్లోనే సబ్సీడీపై నిత్యావసర సరుకులను పంపిణీ ప్రారంభించి, ప్రజల మన్ననలను పొందుతోంది. అయితే మండలంలోని పలు ప్రభుత్వ రేషన దుకాణాల్లో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందరు డీలర్లు డీడీలు చెల్లించి అన్ని సరుకులు తీసుకుంటున్నారు. మండలవ్యాప్తంగా 37రేషనషాపులు ఉన్నాయి. అయితే పలు రేషనషాపుల్లో కార్డుదారులకు సరుకు లు ఇవ్వకుండా పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల అధికార పార్టీ మండల నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్ల సరుకులు ఇవ్వడంలేదన్న ఆరోపణలున్నాయి.
బయోమెట్రిక్‌తో మస్కా
రేషన షాపుల్లో గతంలో ఒక్కొక్క సరుకు కోసం ఒక్కోసారి లబ్ధిదారులతో వేలిముద్ర వేయించేవారు. ప్రస్తుతం ఒక్కసారే వేలిముద్ర వేయి స్తున్నారు. దీంతో ఆ నెల ఏమి ఇస్తున్నారో ఏమి ఇవ్వడం లేదో అర్థం కా వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అక్కడే డీలర్లు మస్కా కొడు తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల కొన్ని సరుకులు రాలేదని చెప్పి లబ్ధిదారులను మభ్యపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మార్చి నెలకు సంబంధించి బియ్యంతో పాటు జొన్నలు ఇచ్చారు.
ఏప్రిల్‌లో మాత్రం బియ్యంతోపాటు చక్కెర మాత్రమే ఇచ్చారు. కార్డుదారులకు అరకేజీ చక్కెర రూ.17, అంత్యోదయ కార్డుదారులకు రూ.13.50 చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి కేజీ గోధుమ పిండి రూ.20 చొప్పున ఇవ్వాల్సి ఉంది. వీటితోపాటు రాగులు, జొన్నలను మూడు కేజీలు ఉచితంగా పంపిణీ చేయాలనే కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనిపై ప్రశ్నించిన లబ్ధిదారులను పలుచోట్ల బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరి నిర్వాకం వల్ల తామందరూ నిందలతో పా టు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు డీలర్లు వాపోతున్నారు.
సరుకులు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి - రాజా, సీఎ్‌సడీటీ, పుట్లూరు
రేషనషాపుల్లో బియ్యంతోపాటు ప్రభుత్వం ఇచ్చే అన్ని సరుకులను తప్పకుండా ఇవ్వాలి. గ్రామాల్లో ఎవరికైనా రేషనషాపుల్లో నిత్యావసర సరుకులు ఇవ్వకుంటే మాకు ఫిర్యాదుచేయండి. విచారించి చర్యలు తీసుకుంటాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....