POT: కుండకు పెరిగిన గిరాకీ
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:39 PM
ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకు బయట తిరగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. బయట నుంచి ఇంటికి వస్తూనే చల్లటి నీరు తాగితే గాని దాహార్తి తీరడం లేదు.
-వేసవిలో మక్కువ చూపుతున్న జనం
పామిడి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకు బయట తిరగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. బయట నుంచి ఇంటికి వస్తూనే చల్లటి నీరు తాగితే గాని దాహార్తి తీరడం లేదు. విద్యుత కొరత వల్ల ఫ్రిడ్జ్ ఉన్న ఉపయోగకరంగా లేకపోతోంది. పైగా ఫ్రిజ్‌లోని నీటి కంటే కుండలోని నీరే శ్రేయస్కరమని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేదోడి ఫ్రిజ్ (మట్టికుండ) వైపు ప్రజలు మక్కువ చూపుతున్నారు. పట్టణంలోని టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద, విద్యుత కార్యాలయం ఎదురుగా, గుత్తి రోడ్డులోని పెద్దమ్మ ఆలయం సమీపాన మట్టి కుండలను విక్రయిస్తున్నారు. వజ్రకరూరు నుంచి కుం డలను తీసుకొచ్చి విక్రయిస్తూ పలు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కుండను బట్టి రూ. 250 నుంచి రూ. 400 వరకూ ధర పలుకుతున్నాయి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....