Share News

BUS STOP: అసంపూర్తిగా బస్‌ షెల్టర్‌

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:57 PM

ప్రజల సౌకర్యార్థం చేపట్టిన బస్సు షెల్టర్‌ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో నేమకల్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయ ణ రూ. 5 లక్షలు మంజూరు చేయగా దాదాపు మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు.

BUS STOP: అసంపూర్తిగా బస్‌ షెల్టర్‌
Bus shelter work halted midway in Nemakallu

బొమ్మనహాళ్‌, జూన 26(ఆంధ్రజ్యోతి): ప్రజల సౌకర్యార్థం చేపట్టిన బస్సు షెల్టర్‌ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో నేమకల్లు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయ ణ రూ. 5 లక్షలు మంజూరు చేయగా దాదాపు మూడు నెలల క్రితం పనులు ప్రారంభించారు. అయితే పైకప్పు వరకు మాత్రమే పనులు చే సి ఆ తర్వాత నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఫలితంగా బస్సు షెల్టర్‌ తలుపులు, కిటీకీలు, ప్లాస్టరింగ్‌, ఫ్లోరింగ్‌, కూర్చునే బెంచీలు, రంగులు వేయడం తదితర పనులు పూర్తికాక అసంపూర్తిగా మిగిలి పోయింది. నేమకల్లులో వెలసిన ఆంజనేయస్వామి దర్శనం కోసం ని త్యం వచ్చే భక్తులు ఆటోలు, బస్పు కోసం ఎండలోనూ, వర్షంలోనూ రో డ్డుపక్కన నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అ సంపూర్తిగా ఉన్న నిర్మా ణం రోజు రోజుకూ పాడైపోతోందని ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప ను లు ఇలా నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని గ్రామస్థులు అంటున్నా రు. పనులు ఎందుకు నిలిచిపోయాయో సంబంధిత అధికారులు స్పష్ట త ఇవ్వడంలేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిలి చిన నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి బస్‌ షెల్టర్‌ నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్థులు, ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 26 , 2026 | 11:57 PM