RDO: తప్పులుంటే తెలపండి: ఆర్డీఓ
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:06 AM
భూ రీసర్వే నిర్వహించిన గ్రా మాల్లోని రైతులకు త్వరలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపు స్తకాలు ఇస్తామని ఆర్డీఓ మహేశ తెలిపారు. ప్రస్తుతం రీసర్వే చేసిన భూముల వివరాలను వివరిస్తామని, అందులో తప్పులుంటే సం బంధి త రైతులు తెలియజేయాలన్నారు.
బత్తలపల్లి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): భూ రీసర్వే నిర్వహించిన గ్రా మాల్లోని రైతులకు త్వరలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపు స్తకాలు ఇస్తామని ఆర్డీఓ మహేశ తెలిపారు. ప్రస్తుతం రీసర్వే చేసిన భూముల వివరాలను వివరిస్తామని, అందులో తప్పులుంటే సం బంధి త రైతులు తెలియజేయాలన్నారు. ఆయనన రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం మండలపరిధిలోని గరశనపల్లిలో రైతుల ఇళ్ల వ ద్దకు వెళ్లి డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను చదివి విని పించారు. గరశనపల్లితో పాటు నేత్తువారంపల్లి, జలాలపురం, మర్రి మా కులపల్లి పొలాల్లా కొన్ని నెలలుగు రీసర్వే చేశామన్నారు. వాటి వివరా లను ఆయా గ్రామాల రైతులకు తెలిపేందుకు వీఆర్‌వోలు, సర్వేయర్లతో ఓ బృందం ఏర్పటు చేశామ న్నారు. వారు ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్లి డ్రాఫ్ట్ పాసుపుస్తకంలోని వివరాలు తెలుపుతారని, ఏవైనా తప్పులుంటే వారికి తెలియజేస్తే సరిదిద్దుతారని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్య క్రమంలో తహసీల్దార్ స్వర్ణలత, మండల సర్వేయర్ జోసఫ్, రీసర్వే డీటీ షణ్ముఖ యాదవ్, వీఆర్‌వోలు, విలేజ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమాలకు పాల్పడితే చర్యలు
ముదిగుబ్బ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమాలకు ఎవరైనా పాల్పడితే కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో మహేష్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని ఉప్పలపాడు సమీపంలో చిత్రావతి నదిలో ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని సీబీఆర్ ఇరిగేషన ఈఈ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నారాయణస్వామి, సీఐ శివరాముడుతో కలిసి ఆయన పరిశీలించారు. అనుమతి ఉన్నచోట మాతమ్రే ఇసుక తవ్వు కోవాలని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవ న్నారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో మణికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....