VACCINE: బాలికలకు హెచపీవీ వ్యాక్సిన
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:55 PM
బాలికలు తప్పని సరిగా క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన వేయించుకో వాలని వైద్యాధికారులు తెలిపారు. పీహెచసీల్లో బుధవారం సర్వేకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ క్యాన్సర్)ను నివారించేందుకు హ్యూమన పాపిల్లో వైరస్ వ్యాక్సిన వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్)
బాలికలు తప్పని సరిగా క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన వేయించుకో వాలని వైద్యాధికారులు తెలిపారు. పీహెచసీల్లో బుధవారం సర్వేకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ క్యాన్సర్)ను నివారించేందుకు హ్యూమన పాపిల్లో వైరస్ వ్యాక్సిన వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 సంవత్స రాలు నిండిన 15 సంవత్సరాలు పూర్తికాని బాలికలు తప్పని సరిగా ఈ వ్యాక్సిన వేయించుకోవాలని వారు సూచించారు. గుంతకల్లు మండలం నాగసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవీన కుమార్ ఆధ్వర్యంలో వ్యాక్సిన వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా విడపనకల్లు పీహెచసీలో వైద్యురాలు మస్రద్‌జాహ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పాల్తూరు, పెద్ద కొట్టాల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోను నిర్వహించారు. బెళుగుప్ప ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో చే పట్టిన టీకాలు వేసే కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా నాయకులు మల్లి కార్జున ప్రారంభించారు. డీటీ ఏకాంబరేశ్వర, సిబ్బంది పాల్గొన్నారు. యాడికిలోని ప్రభుత్వ వైద్యశాలలో బాలికలకు హెచపీవీ టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యుడు పరమేశ్వర్, డిప్యూటీ ఎంపీడీవో శశికళ, వైద్యుడు సాయి సుశాంతరెడ్డి, మలేరియా నివారణ సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. బ్రహ్మసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ఆఫ్‌తాబ్ ఆధ్వర్యంలో ఎంపీపీ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ ప్రభావతి హాజరై హెచపీవీ వ్యాక్సిన వేసే కార్యక్రమం ప్రారంభించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాణి ఎస్తేర్ పీహెచఎన ఆదిబయమ్మ, సూపర్ వైజర్ రామలక్ష్మి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....