Share News

FARMERS: విత్తనం వేసేదెలా?

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:39 PM

ఖరీఫ్‌ సీజన ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో డి. హీరేహాళ్‌ మండల కేంద్ర రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ఎదురు చూస్తున్నారు. డ బ్బులు చెల్లించి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

FARMERS: విత్తనం వేసేదెలా?
Farmers and CPM leaders stage a protest at the closed office.

- ఆందోళనలో మండల కేంద్రం రైతులు

- ఇరవై రోజుల క్రితమే నమోదు

- పంపిణీ కోసం నిరీక్షణ

డి. హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌), జూలై 7(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో డి. హీరేహాళ్‌ మండల కేంద్ర రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ఎదురు చూస్తున్నారు. డ బ్బులు చెల్లించి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. సేద్యపు పను లన్నీ పూర్తి చేసుకున్నా విత్తనాలు అందక విత్తే పనులు ప్రారంభించ లే కపోతున్నారు. విత్తనాల పంపిణీ ఎప్పుడనే విషయంపై స్పష్టమైన స మాచారం అందడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో సాగు ఆల స్యమై దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రానికి చెందిన రైతులకు మాత్రం ఎందుకు పంపిణీ జరగలేదని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 175 మందికి విత్తనాల కోసం దర ఖాస్తు చేసుకోని నగదు చెల్లించారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసి సాగుకు ఆటకం లేకుండా చర్యలు తీసుకోవాలని మండల కేంద్రంలోని రైతులు కోరుతున్నారు.


- వ్యవసాయ అధికారి నిర్లక్ష్య ధోరిణి రైతులను మరింత ఇబ్బందు లకు గురిచేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విత్తనాల పంపిణీపై స మాచారం కోసం ఎన్నిమార్లు ఫోన చేసినా స్పందన లేదని, కార్యా లయానికి వెళ్లినా అధికారి అందుబాటులో ఉండరని రైతులు అంటు న్నారు. చాలాసార్లు కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో తమ సమ స్యను ఎవరికి చెప్పుకోవాలో తెలి యడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన పనితీరుపై రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రెండు, మూడు రోజుల్లో విత్తన కాయలు వస్తాయి

- పద్మజ, ఏడీఏ రాయదుర్గం

డి. హీరేహాళ్‌కు చెందిన రైతులకు అవసరమైన వేరుశనగ విత్తనాల కోసం ఇప్పటికే ప్రతిపాదన పంపాం. విత్తనాలు వచ్చిన వెంటనే పంపిణీ ప్రారంభిస్తాం. మరో రెండు, మూడు రోజుల్లో విత్తనాలు వచ్చే అవకాశం ఉంది. నమోదు చేసుకున్న రైతులందరికీ నిబంధనల ప్రకారం విత్తనాలను పంపిణీ చేస్తాం.


విత్తన పంపిణీలో నిర్లక్ష్యంపై ధర్నా

రైతుల సమస్యలను పట్టించుకోకుం డా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల వ్యవసాయ అఽధికారి కృష్ణకిషోర్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని సీపీఎం మండల కార్య దర్శి లోకేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం వేరుశనగ విత్తన కాయల కోసం ఎదురుచూస్తున్న రైతులతో కలిసి మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట దాదాపు గంటపాటు ధర్నా నిర్వ హించారు. రైతులు వేరుశనగ విత్తనాల కోసం 20 రోజుల క్రితం డబ్బు చెల్లించి రిజసే్ట్రషన చేయించుకున్నా ఇప్పటి వరకు అతిగతి లేదన్నారు. విత్తనాలు ఎప్పుడు ఇస్తారనే కనీస సమాచారం కూడా అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మండల కేంద్రం రైతులకు ఇప్పటి వర కు పంపిణీ చేయకపోవడం వెనుక కారణమేంటని ఆయన ప్రశ్నించారు. రైతుల పట్ట చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న మండల వ్యవసాయ అధికారిపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలసి సీపీఎం ఆఽధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చారించారు. ఈ కార్యక్రమంలో రైతులు బసవరాజు, అంపన్న, దుర్గన్న, హనుమంత, ఎర్రిస్వామి, నీలప్ప, మల్లమ్మ, సరస్వతి, శంకరమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jul 07 , 2026 | 11:39 PM