SHORT: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:48 PM
మండలపరిధిలోని పంతు లచెరువు పంయతీ తెలగుట్లపల్లిలో బుధవారం వనం హనుమంత రెడ్డికి చెందిన ఇంట్లో విద్యుత షార్ట్ సర్క్యూ ట్ కారణంగా వస్తువులు దగ్ధమయ్యాయి. తెలగుట్లపల్లిలో నివాసముంటున్న వనం హను మంతరెడ్డి ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఆయన భార్య దీర్ఘకాలిక రోగంతో మంచాన పడింది.
నల్లచెరువు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని పంతు లచెరువు పంయతీ తెలగుట్లపల్లిలో బుధవారం వనం హనుమంత రెడ్డికి చెందిన ఇంట్లో విద్యుత షార్ట్ సర్క్యూ ట్ కారణంగా వస్తువులు దగ్ధమయ్యాయి. తెలగుట్లపల్లిలో నివాసముంటున్న వనం హను మంతరెడ్డి ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఆయన భార్య దీర్ఘకాలిక రోగంతో మంచాన ఉoది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విద్యుత మీటర్ నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న బట్టలకు వ్యాపించాయి. ఈ క్రమంలో టీవీ, వాషింగ్ మిషన, రెండు మంచా లు, పరుపులు, బట్టలు, టేబుల్ ఫ్యాన, వంట సామాగ్రి ఇతర సామగ్రి కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 3 లక్షలకు పైగా ఆస్తి నష్టంతో పాటు ఇంటిపైకప్పు పూర్తిగా దెబ్బతిందని బాఽధిత కుటుంబ సభ్యులు తెలిపారు.