Share News

MLA: విద్యకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:59 PM

రాష్ట్ర ప్రభుత్వం అ న్ని రంగాల్లోకి విద్యకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం పేర్కొన్నారు. స్థానిక ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో నిర్మాణం పూ ర్తయిన ఉమెన్స హాస్టల్‌ భవనాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఉదయం ప్రారంభించారు.

MLA: విద్యకు అధిక ప్రాధాన్యం
MLA Jayaram inaugurating the women's hostel.

-ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

గుంతకల్లు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అ న్ని రంగాల్లోకి విద్యకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం పేర్కొన్నారు. స్థానిక ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో నిర్మాణం పూ ర్తయిన ఉమెన్స హాస్టల్‌ భవనాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎ మ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్లూ విద్యా భవనాలను పూ ర్తిచేయకుండా, ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తిచేస్తోందన్నారు. ప్రస్తుతం రూ. 6 కోట్లతో ఉమెన్స హాస్టల్‌ను పూర్తిచేసి ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభిస్తున్నామని అన్నారు. ఉమెన్స హాస్టలుకు తగిన భద్రతను కల్పిస్తామని, ఆకతాయిల నుంచి సమస్య ఏర్ప డకుండా పోలీసు ప హారా ఏర్పాటుచేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భం గా పట్ణణానికి చెందిన ఎస్‌ఏ హనీస్‌ ఫాతిమా అనే విద్యార్థిని ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన కంప్యూటర్‌ అండ్‌ న్యూరో సైన్స ఇంటర్న్‌షిప్‌లో ఎంపికై నందున ఎమ్మెల్యే రూ. 10 వేలు, అధ్యాప కుడు క్రిష్ణానాయక్‌ రూ. 5 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లక్ష్మయ్య, నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, బీఎస్‌ కృష్ణా రెడ్డి, కె. కృపాకర్‌, యుగంధర్‌, వీరేశ కుమార్‌, మణికంఠ, కొలిమి రామాంజనేయులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 23 , 2026 | 11:59 PM