RDT: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులపై హర్షం
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:45 PM
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధ రించడంతో మండలంలోని కణేకల్లు క్రాసింగ్‌లోని ఆర్డీటీ ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
కణేకల్లు, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధ రించడంతో మండలంలోని కణేకల్లు క్రాసింగ్‌లోని ఆర్డీటీ ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లను పంచిపెటా రు. ఆర్డీటీ వైద్యులు దు ర్గేష్, రంగయ్య, శ్రీనివాసులు, టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ, వన్నారెడ్డి, ఆది, వేలూరు మరియప్ప, బీటీ రమేష్, షేక్‌ముజ్జు, బాయినేని నవీన, చాంద్‌బాషా, చంద్రశేఖర్‌గుప్తా, మారుతి పాల్గొన్నారు.
గుంతకల్లుటౌన: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కేఎల్ స్వామిదాస్ ఆధ్వర్యంలో స్ధానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధికార ప్రతినిధి హెచ అక్కులప్ప మాదిగ, నాయకులు సుంకన్న, బండారు కుళ్లాయప్ప, తరిమెల ఓబులేసు, జయరాం, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్, మం త్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ స్థానిక నాయకులు బుధవారం పట్టణంలో క్షీరాభిషేకం చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు రవి, రాజు, రామాంజి నేయులు, దళిత సంఘాల నాయకులు గోపాల్, చంద్ర, నారాయణ స్వామి పాల్గొన్నారు.
కూడేరు: ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్దరుణకు కూటమి ప్రభుత్వం చేసిన కృషి మరవలేనిదని దళిత సంఘం నాయకుడు కొర్రకోడు కుంటెన్న పేర్కొన్నారు. బుధవారం కూడేరులో సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్డీటీ సంస్థ వ్యవస్దాపకులు ఫాదర్ ఫెర్రర్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
బెళుగుప్ప: టీడీపీ నాయకుడు వీరాంజనేయులు తదితరులు మం టడలంలోని గంగవరంలో ఎస్సీ కాలనీవాసులతో కలిసి ఆర్డీటీ వ్యవ స్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ, పయ్యావుల కేశవ్‌కు కృ తజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకులు వీరాంజనేయులు, నాగరాజు, బా షా, నారాయణ, జయప్ప, హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....