WOMEN DAY: ఘనంగా మహిళా దినోత్సవం
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:37 PM
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎంఈఓ రవినాయక్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కోట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ ఎం సబహాన అధ్యక్షతన సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు.
గుత్తి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎంఈఓ రవినాయక్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కోట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ ఎం సబహాన అధ్యక్షతన సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. 30 మంది మహిళా ఉపాధ్యాయులను శాలువలతో ఘనంగా సత్కరించారు. క్లస్టర్ కార్యదర్శి శ్రీధర్ గౌడ్, ఉపాధ్యాయులు దాదాభాషా, హంపిరెడ్డి, సురేష్ కుమార్, ఖాజాభాషా, మల్లికార్జున, సుదాకర్, రమేష్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
యాడికి/ పెద్దవడుగూరు: తగిన తోడ్పాటు అందిస్తే మహిళలు అన్నిరంగాల్లో అగ్రశ్రేణిలో ఉంటారని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు విజయ కుమారి, శంషాద్ బేగం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకొని యాడికిలో ఐసీడీఎస్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో అంగనవాడీ వర్కర్లు మహాలక్ష్మి, హేమావతి, రవణకుమారి, జీనత తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దవడు గూరులోని అంగనవాడీ కేంద్రం -2వ సోమవారం నిర్వహించిన మహి ళా దినోత్సవానికి ఎంపీపీ శ్రీదేవి హాజరయ్యారు. తల్లులతో మానవ హారం ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వెంకటలక్ష్మి, అంగనవాడీ కార్యకర్త జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
కుందుర్పి: స్థానిక ఎమ్మార్సీలో అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఎంఈవో లక్ష్మీ దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థాని క ఎంపీపీ కమలమ్మ, సర్పంచ మారుతేశ్వరి, మాజీ ఎంపీపీ గిరిజమ్మ గురుకుల పాఠశాల స్థలదాత గంగమ్మను, మండలంలోని పాఠశాల పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఉపాధ్యాయి నులకు ఆటల పోటీలు నిర్వహిం విజేతలకు బహుమతులు అందజేశా రు. అనంతరం వివిధ హోదాల్లో ఉన్న మహిళలను, మహిళా ఉపాధ్యా యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తిప్పేస్వామి, ఎమ్మార్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....