Share News

DAY: ఘనంగా పంచాయతీ రాజ్‌ దినోత్సవం

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:58 PM

పంచాయతీరాజ్‌ వ్యవస్థతో గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం ఎంతో బలోపేతమైందని ఎంపీడీవో వీ ర్రాజు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్క రిం చుకొని శుక్రవారం యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు

DAY: ఘనంగా పంచాయతీ రాజ్‌ దినోత్సవం
Officers paying respects at Mahatma Gandhi's portrait in Yadiki

యాడికి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ వ్యవస్థతో గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం ఎంతో బలోపేతమైందని ఎంపీడీవో వీ ర్రాజు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్క రిం చుకొని శుక్రవారం యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శశికళ, పలువురు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ఉరవకొండ: పట్టణంలోని మేజర్‌ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవిప్రసాద్‌ మాట్లాడుతూ పంచాయతీ నిధుల ను సక్రమంగా వినియోగించాలన్నారు. పంచాయతీ స్థలాలను నిబంధన లకు విరుద్ధంగా కల్యాణ మండపాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సం స్థలకు కేటాయించారని లోకాయుక్తాలో ఫిర్యాదు చేయడంతో వీటి పైన సమగ్ర విచారణ చేసి, కలెక్టర్‌కు నివేదిక పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సతీష్‌, ఈవో మహ్మద్‌రఫీ, పంచాయతీ రాజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2026 | 11:58 PM