Share News

JSP: ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:26 AM

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇనచార్జ్‌ మంజునాథ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

JSP: ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం
Jana Sena leaders cutting the cake in Uravakonda

(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌)

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇనచార్జ్‌ మంజునాథ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ కళ్యాణ దుర్గం నాయకుడు రూహుల్లా పాల్గొన్నారు. గుంతకల్లు పట్టణంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పూల రమణ ఆధ్వర్యంలో శనివారం ఘ నంగా నిర్వహించారు. వారం క్రితం గుండెపోటుతో మృతి చెందిన బేల్దారి మల్లికార్జున కుటుంబానికి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రమాదేవి చేతుల మీదుగా జనసేన నాయకులు రూ. 10వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వాసిగిరి మణికంఠ ఆధ్వర్యంలో బళ్లారి సర్కిల్‌లోని ఆభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమృత వర్షిణి బాలకళ్యాణ ఆశ్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కురువు పురుషోత్తం ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, అన్నదానం చేపట్టారు. ఉరవకొండలోని పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ ఇనచార్జి గౌతమ్‌ కేక్‌ కట్‌ చేశారు. అంతకు మునువు ఉరగాద్రి చౌడేశ్వరి ఆలయంలో ప్ర త్యేక పూజలు చేశారు. ఆసుపత్రిలో అన్నదానం చేపట్టా రు. యాడికిని పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్‌ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆయా ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 15 , 2026 | 12:26 AM