BHAGIRATH: ఘనంగా భగీరథ జయంతి
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:44 PM
పట్టణంలోని కసాపు రం రోడ్డులో ఉన్న భగీరథ మహర్షి విగ్రహం వద్ద గురువారం ఉప్పర (సగర) సంఘం ఆధ్వర్యలో నిర్వహించిన జయంతి వేడుకలలో జనసే న పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ పార్టీ నియోజకవర్గస మన్వయ కర్త వాసగిరి మణికంఠ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గుంతకల్లు టౌన, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కసాపు రం రోడ్డులో ఉన్న భగీరథ మహర్షి విగ్రహం వద్ద గురువారం ఉప్పర (సగర) సంఘం ఆధ్వర్యలో నిర్వహించిన జయంతి వేడుకలలో జనసే న పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ పార్టీ నియోజకవర్గస మన్వయ కర్త వాసగిరి మణికంఠ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పర సంఘం పట్టణ అధ్యక్షుడు గంగన్న, సభ్యులు సాగర్, శ్రీనివాస్, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, రమేష్, న్యాయవాది నాగశేషు, జనసేన నాయకులు బండి శేఖర్, పవర్ శేఖర్, ఆటో రామకృష్ణ, సుంకర నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గుత్తి: పట్టణంలోని సగర సంక్షేమ సంఘం, సూర్యవంశ వడియ రాజుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం భగీరథ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉప్పర వీధిలోని రాముల గుడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా భగరథ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు నారాయణ, వేణుగోపాల్, తిరుపతయ్య, వెంకప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....