BUILDING: అర్ధాంతరంగా కళాశాల భవనం
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:00 AM
మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల్లో ఇంటర్ విద్య కలగా మారింది. పేద పిల్లలకు గురు కులంలో ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలన్న ఉద్ధేశ్యంతో నిర్మి స్తున్న భవనం అర్ధాంతరంగా ఆగిపోయింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలు జిల్లాలో బాలికలకు మూడు, బాలురకు రెండు ఉన్నాయి.
- గురుకులాల్లో కలగానే ఇంటర్ విద్య
ఉరవకొండ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల్లో ఇంటర్ విద్య కలగా మారింది. పేద పిల్లలకు గురు కులంలో ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలన్న ఉద్ధేశ్యంతో నిర్మి స్తున్న భవనం అర్ధాంతరంగా ఆగిపోయింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలు జిల్లాలో బాలికలకు మూడు, బాలురకు రెండు ఉన్నాయి. వాటిలో వజ్రకరూరు మండలంలోని కొనకొండ్లలో మాత్రమే శాశ్వత భవనం ఉంది. మిగిలిన గోన బావి, నార్పల, డి. హీరేహాళ్, కుందుర్పిల లో ప్రైవేట్ భవనాలు, ఇతర వసతి గృహాల్లో నిర్వహిస్తున్నారు. వజ్రక రూరు మండలంలోని కొనకొండ్ల జ్యోతిరావు ఫూలే బాలుర గురుకు లంలో 466మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఇంటర్ విద్యను అందు బాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో గత టీడీపీ ప్రభుత్వం జూనియర్ కళాశాల, భోజన సదుపాయ భవన నిర్మాణాలను రూ.4.2కోట్లతో చేప ట్టింది.
దాదాపుగా 70శాతం వరకు పనులు పూర్తి అయ్యా యి. అయితే అనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణం పనులు ఆగిపోయాయి. బీసీ సంక్షేమ అధికారులు కూడా దానిని పట్టించుకోలేదు. దీంతో నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు. గురుకులంలో జూనియర్ కళాశాల అందుబా టులోకి వస్తే ప్రతి సంవత్సరం 160మంది దాకా విద్యార్థులు నాలుగు గ్రూప్‌లలో చదువు కునే అవకాశముంటుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమైనా చొరవ చూపి, భవనాన్ని పూర్తి చేసి గురుకులంలో జూనియర్ కళాశాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అలాగే ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల కోసం చేపట్టిన భవన నిర్మాణాలు కూడా ఆగిపో యాయి. ఆరేళ్లుగా ఈ పనులు చేపట్టలేదు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ ఝాన్సీరాణిని వివరణ కోరగా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం వల్ల భవన నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....