Share News

CANAL: మురుగు కాలువలా జీఎస్‌బీసీ

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:08 AM

పట్టణ నడి బొడ్డున జీఎస్‌బీసీ మురుగు కాలువలా మారింది. ఇళ్లలోని మురుగు నీ టిని కాలువలోకి వదులుతుండడంతో మురుగునీటితో నిండి పోయింది. దాని నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కాలవ చెత్తాచెదారం, ముళ్లకంపలతో నిండిపోయింది. పట్ట ణ శివారులోని సీఐటీయూ కాలనీ నుంచి భీమిరెడ్డి కాలనీ వరకు కాలు వకు ఇరువైపులా నివాసముంటున్నారు.

CANAL: మురుగు కాలువలా జీఎస్‌బీసీ
GSBC has turned into a sewage drain filled with thorny bushes and waste.

- ఇళ్లలోని చెత్తాచెదారం, వ్యర్థపు నీరంతా కాలువలోకే

- దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

గుంతకల్లు టౌన, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పట్టణ నడి బొడ్డున జీఎస్‌బీసీ మురుగు కాలువలా మారింది. ఇళ్లలోని మురుగు నీ టిని కాలువలోకి వదులుతుండడంతో మురుగునీటితో నిండి పోయింది. దాని నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కాలవ చెత్తాచెదారం, ముళ్లకంపలతో నిండిపోయింది. పట్ట ణ శివారులోని సీఐటీయూ కాలనీ నుంచి భీమిరెడ్డి కాలనీ వరకు కాలు వకు ఇరువైపులా నివాసముంటున్నారు. వారికి మురుగు కాలువలు లేక పోవడంతో ఇళ్లలోని బాతరూం నీళ్లు జీబీసీ కాలువలోకి వదులుతున్నా రు. మరో పక్క ఇళ్లలోని చెత్తచెదారాన్ని కాలువలో పడేస్తున్నారు. దీంతో కాలువ చెత్తచెదారం, మురుగునీటితో నిండి దుర్వాసన వెదజల్లుతోంది. మస్తానయ్య దర్గా ప్రాంతం, నాగప్ప కాలనీ, మార్కెట్‌ యార్డు, ఎస్కేపీ కళాశాల సమీపంలో కాలువ పక్కనే పాఠశాలలు ఉన్నాయి, కాలువ లో నుంచి వచ్చే దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కాలువలోనే మూత్రవిజర్జన చేస్తున్నారు. ఇళ్లలోని బట్టలు, ఎం డిపోయిన టెంకాయలు, పూలు కాలువలోనే పడేస్తున్నారు. మస్తానయ్య దర్గా సమీపంలో కాలువకు ఇరువైపులా ముళ్లకంపలతో నిండిపో యింది. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణాజలాలను జీఎస్‌బీసీ ద్వారా చెండ్రాయ ని కుంట రిజర్వాయర్‌కు తరలిస్తారు. మార్కెట్‌ యార్డు వద్ద వినాయక ఘాట్‌లో వినాయకులను నిమజ్జనం చేస్తారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువకు ఇరువైపులా ముళ్లకంపలను తొలగించా లని, కాలువలోకి మురుగు నీరు వదలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:08 AM