Share News

FESTIVAL: ఘనంగా ఉగాది వేడుకలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:07 PM

పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంతకల్లు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి ఉత్సవమూర్తికి ఆనవాయితీగా చేపట్టే బియ్యం కొలిచే పోసే కార్యక్రమాన్ని నిర్వహించా రు.

FESTIVAL: ఘనంగా ఉగాది వేడుకలు
Devotees pouring rice to Venkateswara Swamy Utsava Murthy in Guntakallu

(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌)

పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుంతకల్లు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి ఉత్సవమూర్తికి ఆనవాయితీగా చేపట్టే బియ్యం కొలిచే పోసే కార్యక్రమాన్ని నిర్వహించా రు. గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉరవకొండలోని చెరువుకట్ట మీద వెలసిన సుంకలమ్మదేవి, పాతపేటలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. కంబదూరు మల్లేశ్వరస్వామి దేవాలయంలో శివుడికి, కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన అక్కమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడిపత్రి ప్రాంతంలో పొలిమేర పెద్దమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఉగాదిని పురస్కరించుకుని ఆలయాల్లో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. పొలాల్లో ఏరువాక సాగారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 19 , 2026 | 11:07 PM