Share News

GOD: ఘనంగా పట్టం దేవర

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:35 PM

మండల కేంద్రంలో వెలసిన విడపనకల్లుప్ప, కానేకుర్తప్ప దేవతల పట్టం దేవరను ఆదివా రం ఘనంగా నిర్వహించారు. కురుబ కులస్థులు వారి వారి పట్టం దేవ రలను 12 సంవత్సరాలకు(పుష్కర కాలంకు) ఒకసారి నిర్వహిస్తారు.

GOD: ఘనంగా పట్టం దేవర
Devotees in procession of Lords Vidapanakalluppa and Kanekurthappa

విడపనకల్లు, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో వెలసిన విడపనకల్లుప్ప, కానేకుర్తప్ప దేవతల పట్టం దేవరను ఆదివా రం ఘనంగా నిర్వహించారు. కురుబ కులస్థులు వారి వారి పట్టం దేవ రలను 12 సంవత్సరాలకు(పుష్కర కాలంకు) ఒకసారి నిర్వహిస్తారు. అ యితే విడపనకల్లుప్ప, కానేకుర్తప్ప భక్తులు 17 సంవత్సరాలు తరువాత నిర్వహించారు. సుదీర్ఘ కాలం తరువాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో వివిధ ప్రాంతాల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడపనకల్లుప్ప, కానేకుర్తప్ప స్వాములను గ్రామంలో ఘనంగా ఊరేగించి, వీ కొత్తకోట కొండలో ఉన్న బీరప్ప గుడి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములను ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొచ్చి విడపనకల్లుప్ప గుడి వద్ద ఏర్పాటు చేసిన వేదికలో వారి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పట్టం ఎక్కారు. రెండు రోజులుగా జరిగిన ఈ కార్య క్రమంలో కుల గురువులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడపనకల్లు పోలీసులు గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 12 , 2026 | 11:35 PM