TDP: వైభవంగా మహానాడు వేడుకలు
ABN , Publish Date - May 27 , 2026 | 11:57 PM
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు వేడుకలను బుధవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కూడేరు, ఇప్పేరు క్లస్టర్ల పరిధిలో జరిగిన వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిశీలకుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.
కూడేరు, మే 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు వేడుకలను బుధవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కూడేరు, ఇప్పేరు క్లస్టర్ల పరిధిలో జరిగిన వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా పరిశీలకుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, మాజీ ఎంపీపీ బ్రహ్మయ్య, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, క్లస్టర్ ఇనచార్జ్‌లు ప్రసాద్, రాజప్ప తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....