Share News

FESTIVAL: ఘనంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:02 AM

శ్రీలక్ష్మీ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో గురువారం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్‌కు ఉద యాన్నే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం వద్ద హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.

FESTIVAL: ఘనంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం
Devotees performing Rathotsavam

యల్లనూరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): శ్రీలక్ష్మీ వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో గురువారం స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్‌కు ఉద యాన్నే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం వద్ద హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన తహసీల్దార్‌ రాము, ఎస్‌ఐ రామాం జనేయరెడ్డిని ఈఓ ప్రసాద్‌ సత్కరించారు.

ప్రజాప్రతినిధులకు దక్కని గౌరవం: లక్ష్మీవెంకటరమణస్వామి బ్రహ్మో త్సవాల్లో ప్రజాప్రతినిధులను గౌరవించడం ఆనవాయితీ. కానీ ఈ బ్ర హ్మోత్సవాల్లో అధికారులను మాత్రమే సత్కరించి ప్రజాప్రతినిధులను వ దిలేశారు. గ్రామ సర్పంచుకు కూడా ఆహ్వానం అందకపోవడం విశేషం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 13 , 2026 | 12:02 AM