MLA: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:12 AM
రైతుల సంక్షేమం కోసం ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన పథకం నిధులు విడుదల కా ర్యక్రమాన్ని నిర్వహించారు.
-ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుత్తి, జూన20(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం కోసం ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన పథకం నిధులు విడుదల కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 27,520 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18.73 కోట్లు జమచేశామన్నారు. అలాగే ఎల్‌ఆర్‌జీ రకం కంది విత్తన కి ట్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన వెంకటశివుడు యాదవ్, నాయకులు గుమ్మ నూరు ఈశ్వర్, సూర్యప్రతాప్, ఏడీఏ వెంకటరాముడు, ఏఓ మహ బుబ్ బాష, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆయ న టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తుస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....