Share News

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:05 AM

ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు.

MPDO: బడిపిలుస్తోందికి మంచి స్పందన : ఎంపీడీవో
MPDO and MEO-2 spreading awareness with pamphlets

యాడికి, జూన 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేసేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడిపిలుస్తోంది కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోం దని ఎంపీడీవో వీరరాజు, ఎంఈవో-2 సీతారామాంజనేయు లు తెలిపారు. వారు గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం యాడికిలో విస్తృతంగా ప్రచారం చేశారు. పలువురు ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. మానసిక ఒత్తిడి లేని, అన్ని సౌకర్యాలతో కూడిన ఉచిత విద్య ప్రభుత్వ పాఠశాల ల్లోనే సాధ్యమని తెలిపారు. మం డలంలో బడిపిలుస్తోంది వలన ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 400 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...

Updated Date - Jun 05 , 2026 | 12:05 AM