MLA: టీడీపీ ఆవిర్భావంతోనే సుపరిపాలన
ABN , Publish Date - May 27 , 2026 | 11:55 PM
బడుగు బలహీనవ ర్గాలకు అణగారిన వర్గాలకు సుపరిపాలన టీడీపీ ఆవిర్భావంతోనే మొద లైందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహానాడును వర్చ్యువల్ పద్దతిలో నిర్వహించిన నేపథ్యంలో, దానిని వీక్షించడానికి పట్టణంలోని సిరీ కన్వెన్షన హాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్చువల్ ఏ ర్పాట్లు చేయించారు.
- ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం రూరల్, మే 27(ఆంధ్రజ్యోతి): బడుగు బలహీనవ ర్గాలకు అణగారిన వర్గాలకు సుపరిపాలన టీడీపీ ఆవిర్భావంతోనే మొద లైందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహానాడును వర్చ్యువల్ పద్దతిలో నిర్వహించిన నేపథ్యంలో, దానిని వీక్షించడానికి పట్టణంలోని సిరీ కన్వెన్షన హాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్చువల్ ఏ ర్పాట్లు చేయించారు. ఎమ్మెల్యే మొదటి రోజు బుధవారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాయలసీమ జోనల్ ఇనచార్జ్ రెడ్డప్ప గారి శ్రీనివా సరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు మొదటి రోజు స్వచ్ఛందంగా పసుపు కండువాలు, పసుపు జెండాలు చేతబట్టి రావడంతో దుర్గం పసుపుమయంగా మారిందన్నారు. అనేక తీర్మానాలు ప్రవేశపెట్టనుండడంతో ఈ వేదిక అభివృద్ధికి మార్గం అవుతుందన్నారు. పార్టీని బలోపేతం దిశగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా ఆయన బ్రహ్మ సముద్రం మండలం వేపులపర్తిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని క్టస్టర్లలో మహానాడుని నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....