Share News

JCPR: కోర్టుకు వెళితే వెళ్లండి

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:32 PM

‘పెన్నానదిని ఆక్రమించారని, వాటిపైన కోర్టుకు వెళుతున్నాననడం మంచిదే. కో ర్టుకు వెళ్లండి అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దండి. పనిని పరిశీలించి మాట్లాడండి. ఎక్కడి నుంచో వ చ్చి ఇక్కడ కామెంట్లు చేయొ ద్దండి దయచేసి.’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పే ర్కొన్నారు. ఆయన ఆదివారం ప ట్టణంలోని తమ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

JCPR: కోర్టుకు వెళితే వెళ్లండి
JC Prabhakar Reddy is speaking

- అభివృద్ధిని అడ్డుకోకండి : జేసీపీఆర్‌

తాడిపత్రి, ఏప్రిల్‌12 (ఆంధ్రజ్యోతి): ‘పెన్నానదిని ఆక్రమించారని, వాటిపైన కోర్టుకు వెళుతున్నాననడం మంచిదే. కో ర్టుకు వెళ్లండి అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దండి. పనిని పరిశీలించి మాట్లాడండి. ఎక్కడి నుంచో వ చ్చి ఇక్కడ కామెంట్లు చేయొ ద్దండి దయచేసి.’ అంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పే ర్కొన్నారు. ఆయన ఆదివారం ప ట్టణంలోని తమ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలయాలను అభివృద్ధి చేస్తుంటే ఆక్రమించుకున్నారని కొందరు తనను అనడం మంచిది కాదన్నారు. వాటిని పరిశీలించిన తర్వాత మాట్లాడాల న్నారు. తాడిపత్రిని టెంపుల్‌ సిటీగా మార్చాలని తాము చూస్తుంటే ఆక్ర మించుకున్నారని బిల్డింగులు కడుతున్నారని వారు మాట్లాడడం ఎంత వరకు సమంజసమన్నారు. అతి పురాతన బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం కల్యాణ మండపం పక్కన ఉన్న మండపం కూలుతుండడంతో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఢిల్లీకి వెళ్లి వారితో ఆర్కాలజీ వారితో చర్చించి పనులు ప్రారంభించారని అన్నారు. అలాగే అశ్వత్థం, ఆలూరుకోన చెన్న కేశవస్వామి తదితర ఆలయాలను అభివృద్ధిచేసి టెంపుల్‌ సిటీగా మా ర్చడమే తమ ధ్యేయమన్నారు.


అయితే పెన్నానదిని ఆక్రమించుకున్నా రని అనడం సమంజసం కాదన్నారు. తాడిపత్రి దేవాలయాలను అభివృ ద్ధి చేస్తూ, సంబంధిత స్టాల్స్‌ను సీఎం ప్రోగ్రాంలో పెడితే, వాటిని చూసి ఆయన హర్షం వ్యక్తం చేశారన్నారు. తాడిపత్రిని టెంపుల్‌ సిటీగా మా రుస్తామని కలెక్టర్‌, సీఎంకు పంపామన్నారు. గత వైసీపీ ఐదేళ్ల పాలన లో పెన్నానదిలోకి మురుగునీరు వదలడంతో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం కల్యాణ మండపం కుంగిపోయిందన్నారు. ఢిల్లీ నుంచి యం త్రాలను తెప్పించి వాటిని బాగు చేశామన్నారు. అలాగే అక్కడున్న దోభీ ఘాట్టను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో మీరు గాయత్రి గుడి, సాయిబాబా గుడి అభివృద్ధిని అడ్డుకున్నారని, మీ పని అంతా అడ్డుకోవడమేనా అంటూ ఎద్దేవాచేశారు. ప్రస్తుతం అశ్వత్థం అ భివృద్ధికి రూ. 8కోట్లు మంజూరయ్యాయన్నారు. మీ హయాం వచ్చే ముందు వక్ఫ్‌ బోర్డు నిధులు రూ. 4000 ఉంటే ప్రస్తుతం రూ. 84లక్షలు ఉందంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి మటుకు ఆగదని ఆయన స్పంష్టం చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 12 , 2026 | 11:32 PM