Share News

FESTIVAL: ఘనంగా శ్రీవారి కల్యాణం

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:42 PM

శ్రీలక్ష్మీ వెంకటరమ ణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో బుధవారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 4గంటల నుంచి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు.

FESTIVAL: ఘనంగా శ్రీవారి కల్యాణం

యల్లనూరు, మార్చి11 (ఆంధ్రజ్యోతి): శ్రీలక్ష్మీ వెంకటరమ ణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో బుధవారం స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 4గంటల నుంచి కల్యాణోత్సవాన్ని ప్రారంభించారు. వేదపండితులు బుక్కాపురం ప్రసాద్‌ స్వామి ఆధ్వర్యంలో కల్యాణాన్ని కుప్ప వెంకట్రామయ్య, అలివే లమ్మ కుటుంబ సభ్యులు నిర్వహించారు.


కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై ఊరేగించారు.

నేడు విద్యుత సరఫరా నిలిపివేత

యల్లనూరు మండలకేంద్రంలో గురువారం శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా విద్యుత సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్సకో ఏఈ పద్మనాభరెడ్డి తెలిపారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 వరకు రథోత్సవం జరిగే ప్రదేశంలో విద్యుత సరఫరా ఉండదన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 11:42 PM