Share News

PETITION: మా భూమి ఇప్పించండి

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:13 AM

బ్రిటిష్‌ కాలంలో రూపొం దించిన డైక్లాట్‌లో కమ్మర కులస్థులకు కేటాయించిన ఈనాం భూమిని ఓ వైసీపీ నాయకుడి ఆధీనంలో ఉందని మండలంలోని జల్లిపల్లికి చెంది న కమ్మర కులస్థులు ఆరోపించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజేఆర్‌కు మండలంలోని జల్లిపల్లికి చెందిన కమ్మర కులస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

PETITION: మా భూమి ఇప్పించండి
Blacksmith castes submitting petition to Resurvey Dt

- వైసీపీ నాయకుడిపై కుమ్మరి కులస్థుల ఫిర్యాదు

కూడేరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : బ్రిటిష్‌ కాలంలో రూపొం దించిన డైక్లాట్‌లో కమ్మర కులస్థులకు కేటాయించిన ఈనాం భూమిని ఓ వైసీపీ నాయకుడి ఆధీనంలో ఉందని మండలంలోని జల్లిపల్లికి చెంది న కమ్మర కులస్థులు ఆరోపించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజేఆర్‌కు మండలంలోని జల్లిపల్లికి చెందిన కమ్మర కులస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కమ్మర శ్రీనివాసులు మాట్లాడుతూ ఉదిరిపికొండ రెవెన్యూ గ్రామపరిధిలో సర్వేనం. 486లో 24.44 ఎకరాల భూమిని బ్రిటిష్‌ ప్రభుత్వం ఈనాం పేరుతో కమ్మర కులస్థులకు కేటాయించిందన్నారు. ఆ భూమిని తమ గ్రామానికి చెందిన వైసీపీ మండల కన్వీనర్‌ బైరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబ స భ్యులు దౌర్జన్యంగా సాగు చేస్తున్నారన్నారు. తాము కూ డా వైసీపీనే అని, ఆ పార్టీ నాయకుడే తమకు అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని పోరాటాలు చేసినా రాజకీయ పలుకుబడితో తమపైనే దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనలైనలో వారిపేర్లను తొలగించి అర్హులైన కమ్మర కులస్థులకు కేటాయించాలని రీ సర్వే డిప్యూటీ తహసీల్దారు దబ్బర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 03 , 2026 | 12:13 AM