Share News

CARTS: చెత్త బండ్లు చెట్ల కిందే..!

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:11 AM

గ్రా మా లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం అందించిన చెత్త సేకరణ బండ్లు చెత్తకుప్పలోకి చేరాయి. డి. హీరేహాళ్‌ మండలంలోని సోమలా పురం, మురడి గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరించాల్సిన ఈ బండ్లు వినియోగానికి నోచుకోకుండా చెట్ల కింద, భవనాల పక్కన పడేశారు.

CARTS: చెత్త బండ్లు చెట్ల కిందే..!
Carts lying unused under trees in Somalapuram village.

డి. హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌), జూన 27 (ఆంధ్రజ్యోతి): గ్రా మా లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం అందించిన చెత్త సేకరణ బండ్లు చెత్తకుప్పలోకి చేరాయి. డి. హీరేహాళ్‌ మండలంలోని సోమలా పురం, మురడి గ్రామాల్లో ఇంటింటికీ చెత్త సేకరించాల్సిన ఈ బండ్లు వినియోగానికి నోచుకోకుండా చెట్ల కింద, భవనాల పక్కన పడేశారు. సోమలాపురం గ్రామంలో చెత్త బండ్లను నెలల తరబడి చెట్ల కిందే ని లిపివేయగా, మురడిలో పాడైపోయిన బండ్లను ఒక మూలకు తోసే శారు. నిర్వహణ లేక తుప్పు పట్టిన ఈ బండ్లు ఇప్పుడు చెత్త తరలిం చడం పక్కనబెడితే కదిలించే స్థితిలో కూడా లేవని స్థానికులు అంటు న్నారు. ఒకవైపు గ్రామాల్లో చెత్త సక్రమంగా సేకరించక పారిశధ్య సమ స్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు ప్రజాధనంతో కొనుగో లు చేసిన బండ్లు నిరుపయోగంగా మారడం విమర్శలకు తావిస్తోంది. స్వచ్ఛత పేరుతో నిధులు ఖర్చు చేసి బండ్లు కొనుగోలు చేసినా, ఆ తర్వాత వా టి వినియోగాన్ని పూర్తిగా గాలికొదిలేశారని గ్రామస్థులు మండిపడ తున్నారు. ఇప్పటికైనా అధికారు లు స్పందించి చెత్త బండ్లను మ రమ్మతులు చేయించి వినియో గంలోకి తేవాలని గ్రామస్థులు కో రుతున్నారు. తద్వారా గ్రామా ల్లో పారిశుధ్య నిర్వహణను ప టిష్టం చేయాలని అంటున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 28 , 2026 | 12:11 AM