ROADS: నెరవేరిన సీఎం హమీలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:59 PM
గత ఏడాది మేలో హం ద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు వజ్రకరూరు మండలం చాయాపురానికి ఇచ్చిన హామీలు నెరవేరాయి. అందుకు అనుగుణంగా గ్రామంలో రూ.2. 26కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.
- చాయాపురంలో రూ.2. 26కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం
ఉరవకొండ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): గత ఏడాది మేలో హం ద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు వజ్రకరూరు మండలం చాయాపురానికి ఇచ్చిన హామీలు నెరవేరాయి. అందుకు అనుగుణంగా గ్రామంలో రూ.2. 26కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రోడ్ల నిర్మాణం , డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. రూ.1.26 కోట్లతో సీసీరోడ్లు, రూ.కోటితో సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కవర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. బీసీ కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టడంతో ఆ కాలనీ వా సులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామ సమీపంలోని ఉరవకొండ- గుంతకల్లు ప్రధాన రహదారిలో తారు రోడ్డు నిర్మాణానికి రూ.1.6కోట్లు నిధులు మంజూరైనట్లు గ్రామస్థులు తెలిపారు.
అభివృద్ధి పనులతో తమ గ్రామం రూపు రేఖలు మారాయని గ్రామస్థులు, సర్పంచు మాలపాటి కమలమ్మ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
దశాబ్దాల కలసాకారం
ఉరవకొండ: పట్టణంలో కణేకల్లు రహదారి నుంచి పాతమార్కెట్, గుంతకల్లు రహదారిని కలుపుతూ చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. సుమారు 3 కిలో మీటర్ల మేర రూ.3కోట్లతో ఈ పనులను చేపట్టారు. దశాబ్ధాల కాలంగా నిర్మాణానికి నోచుకోని ఈ రోడ్డుకు కూటమి ప్రభు త్వంతో మోక్షం లభించిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుంతకల్లు రహదారి నుంచి చెరువు కట్ట వరకూ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. పాత సంత మార్కెట్ నుంచి బళ్లారి జాతీయ రహదారి వైపు రెండు వరసల సిమెంట్ దారి నిర్మాణం పూర్తి అయిందని ఏఈఈ నాగభూషణం తెలిపారు. ఈ రోడ్డు పూర్తి తో శాంతి నగర్, కొలిమి లేఅవుట్ పాతమార్కెట్, గాంధీ బజార్‌కు వెళ్లే ప్రజలు, వాహనదారులకు ఎంతో వెసలుబాటు ఉంటుంది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....