LAKES: మరువ పారుతున్న చెరువులు
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:38 PM
మండలంలోని గొ ట్లూరు, పోతుకుంట, రేగాటిపల్లి చెరువులు హాంద్రీనీవా నీటితో నిం డి మరువ పోతున్నాయి. నెల రోజుల క్రితం నుంచి చెరువులకు నీరు చేరుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి మరువ పారు తున్నాయి. దీంతో ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మవరం రూరల్, జనవరి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని గొ ట్లూరు, పోతుకుంట, రేగాటిపల్లి చెరువులు హాంద్రీనీవా నీటితో నిం డి మరువ పోతున్నాయి. నెల రోజుల క్రితం నుంచి చెరువులకు నీరు చేరుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి మరువ పారు తున్నాయి. దీంతో ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు నిండటంతో ఆయకట్టు భూమి సాగు లోకి వస్తుందని, ఇప్పటికే సాగుచేసుకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. గొట్లూరు చెరువు ఆయకట్టు భూమిలో వరిసాగు కోసం రైతులు నారు సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది వర్షపు నీరు చెరువులకు చేరుకోవడంతో పాటు హంద్రీనీవా నీరు రావడంతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. చెరువులు నిండటంతో గ్రామాల్లోని భూగర్భజలాలు పెరిగి రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారని ఆయా గ్రామప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....