SHEEP: మూగజీవాలకు మేత కరువు
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:06 AM
గత ఖరీఫ్ సీజనలో సక్రమంగా వర్షాలు కురవక పోవడంతో మండలంలో పశుగ్రాసం కరువైంది. దీంతో మూగజీవాలు మేత కోసం అలమటి స్తున్నాయి. మండల వ్యాప్తంగా మాకొడికి తండా, చెర్లోపల్లి, మాలేపల్లి, ఐదుకల్లు, కనుకూరు, పెరుగుపాలెం గ్రామాలలో అధిక సంఖ్యలో గొర్రెల పెంపకం చేపట్టారు.
ప్రభుత్వం ఆదుకోవాలంటున్న కాపరులు
శెట్టూరు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): గత ఖరీఫ్ సీజనలో సక్రమంగా వర్షాలు కురవక పోవడంతో మండలంలో పశుగ్రాసం కరువైంది. దీంతో మూగజీవాలు మేత కోసం అలమటి స్తున్నాయి. మండల వ్యాప్తంగా మాకొడికి తండా, చెర్లోపల్లి, మాలేపల్లి, ఐదుకల్లు, కనుకూరు, పెరుగుపాలెం గ్రామాలలో అధిక సంఖ్యలో గొర్రెల పెంపకం చేపట్టారు. అయితే పశుగ్రాసం కొరత ఏర్పడటంతో కాపరులు బళ్లారి, హోస్పేట తదితర ప్రాంతాలకు గొర్రెలను మేత కోసం తీసుకెళుతు న్నారు. దీనికి తోడు మూగజీవాలకు తాగునీరు కూడా కరువవ్వడంతో కాపరులలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
మూగజీవాల పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి మూగజీవాల కోసం గ్రాసం అందించి, నీటి వసతి కల్పించి గొర్రెల కాపరులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
గొర్రెల పోషణ భారమైంది- కిష్టప్ప, బసంపల్లి
గత ఖరీఫ్‌లో మండలంలో వర్షాలు సరిగా కుర వలేదు. ఈ కారణంగా పచ్చగడ్డి ఎక్కడా సరిగా పెరగలేదు. ప్రస్తుతం పొలాల్లో ఎక్కడా ఎండుగడ్డి కూడా కనబడడంలేదు. దీంతో గొర్రెలకు మేత కరువైంది. దీంతో కాపరులకు మూగ జీవాల పోష ణ భారమైంది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఆదుకోవాలి.