MLA: బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:37 PM
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు కాలవ రమణ కుటుంబానికి ఎమ్మెల్యే అమి లినేని సురేంద్రబాబు రూ. లక్ష ఆర్థికసాయాన్ని అందించారు. ఆయన మంగళవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద కాలవ రమణ కుటుంబసభ్యులకు ఈ సాయం అందించారు.
కళ్యాణదుర్గం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు కాలవ రమణ కుటుంబానికి ఎమ్మెల్యే అమి లినేని సురేంద్రబాబు రూ. లక్ష ఆర్థికసాయాన్ని అందించారు. ఆయన మంగళవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద కాలవ రమణ కుటుంబసభ్యులకు ఈ సాయం అందించారు. కాలవ రమణ భార్య రాజేశ్వరి, కూతురు జాహ్నవితో వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ అన్ని విధాల ఆదుకుంటామని హామీనిచ్చారు.
ప్రతి ఇంటికి సోలార్ సిస్టం వేయించుకోండి
ప్రతి ఇంటికి సోలార్ సిస్టం వేయించుకుని వి ద్యుతను ఆదా చేసుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అ న్నారు. మండల పరిధిలోని గాజులపల్లిలో మంగళవారం పీఎం సూర్య ఘర్ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే నియోజకవర్గంలో 2438 మందికి గాను రూ.27 కోట్ల వ్యయంతో సోలార్ సిస్టమ్‌ను అందించబోతున్నామని తెలిపారు. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా పనిచేసిన ఉషశ్రీచరణ్ ఏ గ్రామంలోను మౌలిక సదుపా యాలు కల్పించలేదని, అభివృద్ధిని శూన్యంగా మార్చి వెళ్లిపోయారని విమర్శించారు. ఈ కార్యక్ర మంలో ఆయాశాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....