Share News

TDP: కూటమి కృషి తోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:46 PM

కూటమి ప్రభుత్వం కృషి ఫలితమే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ అయిందని టీడీపీ నాయకులు పేర్కొరు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నా యకులు మంగళవారం స్థానిక ప్రజావేదిక నుంచి బైక్‌ ర్యాలీగా టీ స ర్కిల్‌ వరకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ చిత్ర పటాలకు క్షీరాభి షేకం చేశారు.

TDP: కూటమి కృషి తోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌
TDP leaders anointing portraits of Prime Minister and CM

కళ్యాణదుర్గం రూరల్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం కృషి ఫలితమే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ అయిందని టీడీపీ నాయకులు పేర్కొరు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నా యకులు మంగళవారం స్థానిక ప్రజావేదిక నుంచి బైక్‌ ర్యాలీగా టీ స ర్కిల్‌ వరకు వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూ టీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ చిత్ర పటాలకు క్షీరాభి షేకం చేశారు. అనంతరం ఆర్డీటీ ఆస్పత్రి వద్ద ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మార్కెట్‌ యార్డు చైర్మన గోళ్ల లక్ష్మీదేవి, వైస్‌ ఛైర్మన కోనంకి రాజశేఖర్‌, టీడీపీ నాయకులు చౌళం మల్లికార్జున, మండల అధ్యక్షుడు గోళ్ల వెంకటేశులు, ధనుంజయ, పాలబండ్ల శ్రీరాము లు, పట్టణ అధ్యక్షులు డిష్‌ మురళి, కురుకుంట రామాంజినేయులు, రామ్మోహన, కుబేర యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 24 , 2026 | 11:46 PM