Share News

MLA: ఎమ్మెల్యే కృషితోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:07 AM

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితోనే ఆర్డీట్జీట ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ సాధ్య మైందని దివ్యాంగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్‌ సింహ అ న్నారు. దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును పూలమాల లు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.

MLA:  ఎమ్మెల్యే కృషితోనే ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌
Disabled people honoring MLA Amilineni Surendrababu

- దివ్యాంగుల సంఘం నాయకులు

కళ్యాణదుర్గం, మార్చి31(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితోనే ఆర్డీట్జీట ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ సాధ్య మైందని దివ్యాంగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్‌ సింహ అ న్నారు. దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును పూలమాల లు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎంతో మందికి వైద్య సదుపాయాలు కల్పించి ఆదుకున్న ఆర్డీటీకి ఎమ్మెల్యే నేడు ప్రాణం పోశారన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలను ఒక్కటిగా చేసి కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించార న్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు నాగమణి, రేణుక, రాము, బండి గోపాల్‌, దుర్గేశ, నాగరాజు, వడ్డె గోపి, బాలు, రవి, ఆంజనేయులు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 01 , 2026 | 12:07 AM