M LA: ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ జిల్లా ప్రజలకు వరం
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:35 PM
ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యు వల్ చేయడం జిల్లా ప్రజలకు వరంలాంటిదని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది లబ్ధిపొందుతున్నారని అ న్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించిన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే నివాసంలో గురువారం క్రీడాకారులు, విద్యార్థులతో ఎమ్మెల్యే కేక్‌ను కట్‌చేసి సంబరాలు జరిపారు.
- ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి
తాడిపత్రి, మార్చి26(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యు వల్ చేయడం జిల్లా ప్రజలకు వరంలాంటిదని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది లబ్ధిపొందుతున్నారని అ న్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించిన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే నివాసంలో గురువారం క్రీడాకారులు, విద్యార్థులతో ఎమ్మెల్యే కేక్‌ను కట్‌చేసి సంబరాలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అనంతపురం జిల్లా కరువు కాటకాలతో ఉన్న సమయంలో ప్రజలకు ఆర్డీటీ సేవలు ఎంతో తోడ్పడ్డాయన్నారు. అలాంటి ఆర్డీటీ సేవలు కొనసాగేలా ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయడంతో జిల్లా ప్రజలు ఎంతో సంతోషపడ్డారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమితషా సహకారంతో రెన్యువల్ చేశారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీటీ సేవలు మరువ రానివని ఆయన పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....