Share News

MLA: కూటమితోనే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:56 PM

కూటమి ప్రభుత్వం కృషితోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ ను రెన్యువల్‌ చేసిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేశలు పలు మార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.

MLA: కూటమితోనే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌
MLA paying respects at the statue of Father Ferrer in Kalyanadurgam

- ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

- ఘనంగా ఫాదర్‌ ఫెర్రర్‌ జయంతి

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం కృషితోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ ను రెన్యువల్‌ చేసిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేశలు పలు మార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ జయంతి సందర్భంగా గురువారం పట్టణంలోని ఆర్డీటీ ఆసుపత్రి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్లి ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లా డుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల వంటి ఆసుపత్రులు నిర్మించి ఎంతో మందికి ప్రాతదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ అని కొనియాడారు. ఆయన ఆశ యాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 09 , 2026 | 11:57 PM