Share News

MLA: రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:53 PM

రైతు క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అ న్నారు. ఆయన సోమవారం ప్రజావేదికలో విలేకరుల సమావేశం నిర్వ హించి మాట్లాడారు. బీటీపీ కాలువ పనులను పూర్తి చేసి కృష్ణాజ లాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

MLA: రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయం
MLA with the recipients of CMRF cheques

- ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం రూరల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రైతు క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అ న్నారు. ఆయన సోమవారం ప్రజావేదికలో విలేకరుల సమావేశం నిర్వ హించి మాట్లాడారు. బీటీపీ కాలువ పనులను పూర్తి చేసి కృష్ణాజ లాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. బీటీపీ కాలువ ఎనిమిది యేళ్ల క్రితం ధరలకే ఇప్పుడు పనులు చేస్తుండటం వలన కాలువ పూర్తయ్యే సమయానికి రూ. 80 నుంచి రూ. వంద కోట్ల వర కు నష్టం వస్తుందని, అయినా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. . అనంతరం ఆయన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 38 మంది బాధితులకు దాదాపు రూ. 23.55 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొత్త కోర్టులకు భవనాలు ఏర్పాటు చేస్తాం

కళ్యాణదుర్గంరూరల్‌: పట్టణానికి మరో రెండు అదనపు కోర్టులు మంజూరయ్యాయనీ, వాటికి అవసరమైన భవనాలను ఏర్పాటు చేస్తా మని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌ను పిలిపించి, అందుబాటులో ఉన్న భవనాలు గుర్తించి కోర్టుల ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని తెలిపారు. సోమవారం ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యేను బార్‌ అసోసియేషన సభ్యులు కలిశారు. త్వరలో అనుకూలమైన స్థలాలను గుర్తించి భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బార్‌ కౌన్సిల్‌ సభ్యులు.. ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 30 , 2026 | 11:53 PM