Share News

FARMERS: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:54 PM

ఈ యేడాది ఖరీఫ్‌ సీజనకు ముందే వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు, సేద్యాలు చేయడంలో నిమగ్నమయ్యారు. కాడెద్దులు, ట్రాక్టర్‌పై ఆధారపడి వ్యవసాయ పనులు చేస్తున్నా రు.

FARMERS: ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు
A farmer plowing with a tractor in a Beluguppa field

బెళుగుప్ప, జూన 4 (ఆంధ్రజ్యోతి): ఈ యేడాది ఖరీఫ్‌ సీజనకు ముందే వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు, సేద్యాలు చేయడంలో నిమగ్నమయ్యారు. కాడెద్దులు, ట్రాక్టర్‌పై ఆధారపడి వ్యవసాయ పనులు చేస్తున్నా రు. ఖరీఫ్‌లో కంది, ఆముదం పంటలు సాగుచేసేందుకు మండలంలోని రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండలంలో రైతులు కంది పంట సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు.

కంది పంట అనుకూలం - కల్లప్ప, రైతు, బెళుగుప్ప

ముందే వరుణుడు కరుణించడంతో ఖరీఫ్‌ లో పంటలు సాగుచేసే రైతులకు అనుకూలం గా ఉంది. నేను పది ఎకరాలలో కంది పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నా. పంటకు తెగుళ్లు సోకకుంటే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...

Updated Date - Jun 04 , 2026 | 11:54 PM