THIEFT: రైతులకు దొంగల బెడద
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:27 PM
మండ లంలో కేబుల్ దొంగలు పేట్రేగిపోతున్నారు. వ్యవసాయ తోటల్లో వరుసగా కేబుల్, స్టార్టర్ బాక్సులు చోరీలకు పాల్పడుతున్నారు. తోటల్లో బోర్ల వద్ద కేబుల్ వైర్లు కత్తిరించి తీసుకెళుతు న్నారు. అదేవిధంగా స్టార్టర్ బాక్సులు ఎత్తుకెళు తున్నారు.
- అధికమైన వ్యవసాయ బోర్ల కేబుల్, స్టార్టర్ బాక్సుల చోరీలు
- ఆందోళనలో అన్నదాతలు
శెట్టూరు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): మండ లంలో కేబుల్ దొంగలు పేట్రేగిపోతున్నారు. వ్యవసాయ తోటల్లో వరుసగా కేబుల్, స్టార్టర్ బాక్సులు చోరీలకు పాల్పడుతున్నారు. తోటల్లో బోర్ల వద్ద కేబుల్ వైర్లు కత్తిరించి తీసుకెళుతు న్నారు. అదేవిధంగా స్టార్టర్ బాక్సులు ఎత్తుకెళు తున్నారు. దీంతో అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక గ్రామంలో వాటి దొంగతనం జరుగుతున్నా పోలీ సులు మాత్రం నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ తోటల్లో కేబుల్, స్టార్టర్ బాక్సుల చోరీలపై పోలీసులు దృష్టి సారించక పోవ డంతో చోరీ జరిగిన ప్రాంతంలోనే మళ్లీ చోరీలకు పాల్పడుతున్నారు. మండలంలోని బసంపల్లి, చిన్నంపల్లి, బొచ్చుపల్లి గ్రామాలలో స్టార్టర్ బాక్సుల చోరీలు అధికంగా జరుగుతున్నాయి. అన్నదాతలు అరకొరగా వస్తున్న నీటితోనే పంటలు సాగు చేసి, వాటిని కాపాడుకునేందుకు పలు అవస్థ లు పడుతున్నారు. అయితే దొంగలు వ్యవసాయ బోర్లుకు సంబంధించిన వి ద్యుత పరికరాలు ఎత్తుకెళ్లడంతో పంట లు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇ ప్పటికే మండలంలో చాలామంది రైతుల వ్యవసాయ బోరుబావులకు సంబం ధించిన కేబుల్‌ను ఎత్తుకెళ్లారు. ఇలా అ యితే రూ. లక్షలు అప్పులు చే సి పంటలు సాగుచేసిన పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎస్‌ఐ సుమనను వివరణ కోరగా మం డలంలోని వ్యవసాయ బోరుబావుల కేబుల్, స్టార్టర్ బాక్సుల చోరీపై ఆధారాలు సేకరిస్తామన్నారు. ఆ చోరీలపై నిఘా పెట్టి అరికడతామని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....