Share News

MLA: రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:08 AM

రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్‌ కాల వ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని శిరిగేదొడ్డి గ్రామంలో మం గళవారం రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల పంపిణీని ఆయన ప్రారంభించారు.

MLA: రైతు సంక్షేమమే ధ్యేయం
Government Whip Kalava launching seed distribution in Sirigedoddi.

- ప్రభుత్వ విప్‌ కాలవ

గుమ్మఘట్ట, జూన 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్‌ కాల వ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని శిరిగేదొడ్డి గ్రామంలో మం గళవారం రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. రైతుల కోసం రాయతీతో డ్రిప్‌ సౌకర్యాలు, ఎరువులు, విత్తనా లు పంపిణీతో పాటు పంటలకు సకాలంలో మార్కెట్‌ సౌకర్య కల్పించేం దుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన దానవేంద్ర, బీటీ ప్రాజెక్ట్‌ చైర్మన కాలవ రాజు, టీడీపీ మండల కన్వీనర్‌ కాలవ సన్నన్న, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

డి. హీరేహాళ్‌, (బొమ్మనహాళ్‌): డి.హీరేహాళ్‌ మండలంలోని మురడి గ్రామంలో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. రైతుల సం క్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పంటల సాగుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారులు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కదూలూరు మోహనరెడ్డి, క్లస్టర్‌ కన్వీనర్‌ గంగధర, టీడీపీ నాయకులు కల్యం తిప్పేస్వామి, దొడఘట్ట రామంజినేయులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 17 , 2026 | 12:08 AM