Share News

GOD: అక్కమాంబ జాతర ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:01 AM

ఉగాది పండుగను పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించే అక్కమాంబ జాతరను అత్యంత వైభవంగా జరిపిద్దామని టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ సూచించారు. ఆయన బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

GOD:  అక్కమాంబ జాతర  ఏర్పాట్ల పరిశీలన
Devineni Dharmateja, the TDP leaders who are examining the arrangements

కళ్యాణదుర్గం రూరల్‌, మార్చి18(ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగను పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించే అక్కమాంబ జాతరను అత్యంత వైభవంగా జరిపిద్దామని టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ సూచించారు. ఆయన బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు సూచించారు. ఆల య ప్రాంగణంలో చేపట్లే భోజన వసతులను పరిశీలించారు. అందరూ కలిసికట్టుగా అక్క మాంబ జాతరను పెద్ద ఎత్తున విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, కూటమి నాయకులు తదితరులు ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 19 , 2026 | 12:01 AM