Share News

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:12 AM

ప్రజల జీవన ప్రమాణాల్లో విప్ల వాత్మక మార్పులు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి అధికారి ఒక విజనరీలా(దూరదృష్టితో) పనిచేయాలని అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన స్వర్ణ రాయదుర్గం విజన - 2047 యాక్షన ప్లాన గురించి అధికారులతో చర్చించారు.

MLA: ప్రతి అధికారి విజనరీలా పనిచేయాలి
MLA Kalava Srinivasulu speaking in the meeting

- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గంరూరల్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రజల జీవన ప్రమాణాల్లో విప్ల వాత్మక మార్పులు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి అధికారి ఒక విజనరీలా(దూరదృష్టితో) పనిచేయాలని అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన స్వర్ణ రాయదుర్గం విజన - 2047 యాక్షన ప్లాన గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం కేవలం వర్తమానం గురించి కాకుండా రాబోయే పాతికేళ్లలో ప్రజల జీవన ప్రమా ణాలు ఏ విధంగా ఉండాలో ఆలోచించాలని సూచించారు. ప్రజల ఆశలకు అనుగుణంగా ఏయే రంగాల్లో ఎలాంటి పురోగతి సాధించాలో స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాలపై సమగ్ర ప్రణాళికను రూపొందించి,


వాటి సాధనకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తెలుగురాషా్ట్రల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రంలోనూ లేవన్నారు. పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వివరించారు. అయితే సంక్షేమానికే పరిమితం కాకుండా అభివృద్ధిలోనూ సమతుల్యత పాటించినపుడే సమగ్ర లక్ష్యాలను సా ధించగలమన్నారు. నిధులను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునేలా ప్రతి శాఖ సిద్ధం గా ఉండాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గం 32వ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీడీవో కొండన్న, ఐదు మండలాల తహసీల్దార్లు బ్రహ్మయ్య, శ్రీనివాసులు, మునివేలు, రజాక్‌బాష, ఎంపీడీవోలు, వ్యసాయాధికారులు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 23 , 2026 | 12:12 AM