Share News

FESTIVAL: వైభవంగా ఏరువాక పౌర్ణమి

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:48 PM

మండలంలోని శ్రీధరఘ ట్ట, ఉంతకల్లు తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను సోమ వారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ ఎద్దు లను కడిగా, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గంటలు, పూలమాల లతో అలంకరించి పూజలు చేశారు.

FESTIVAL: వైభవంగా ఏరువాక పౌర్ణమి

బొమ్మనహాళ్‌, జూన, 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీధరఘ ట్ట, ఉంతకల్లు తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను సోమ వారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ ఎద్దు లను కడిగా, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గంటలు, పూలమాల లతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం గ్రామ దేవతలకు మొ క్కులు చెల్లించారు. మంచి వర్షాలు కురిసి, సమృద్ధిగా పంటలు పండా లని వేడుకొన్నారు. గ్రామ శివారులో నిర్వహించిన ఎద్దుల సవారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎద్దులు వేగంగా పరుగులు తీస్తుండగా వాటిని అదుపు చేస్తూ యువకులు తమ ప్రతిభను చాటారు. ఎద్దుల దూకుడుకు ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ఉత్సాహపరిచారు. చిన్నారులు, మహిళలు, యువకులు పెద్ద సంఖలో హజరై పండుగను తిలకించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 29 , 2026 | 11:48 PM