FESTIVAL: వైభవంగా ఎర్రిస్వామి రథోత్సవం
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:53 PM
మండల పరిధిలోని వై. రాంపురం గ్రామంలో వెలసిన ఎర్రిస్వామి రథోత్సవాన్ని శనివారం వై భవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు.
ఉరవకొండ, మార్చి7(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని వై. రాంపురం గ్రామంలో వెలసిన ఎర్రిస్వామి రథోత్సవాన్ని శనివారం వై భవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఆలయం నుంచి బొడ్రాయి వరకు లాగి తిరిగి యథాస్ధానానికి చేర్చారు. పోలీసులు బందోబస్త్ నిర్వ హించారు. ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....