Share News

PEOPLE: ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చూడండి

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:54 PM

రాయలచెరువు రైల్వేస్టేషనలో ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌, ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మండలవా సులు వినతిప త్రం అందజేశారు. అనంతపురంలోని కార్యాలయంలో ఎంపీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

PEOPLE:  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చూడండి
Yadiki mandal residents submitting a representation to the MP.

- ఎంపీ అంబికాకు యాడికి మండల ప్రజల వినతి

యాడికి, జూన 26(ఆంధ్రజ్యోతి): రాయలచెరువు రైల్వేస్టేషనలో ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌, ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మండలవా సులు వినతిప త్రం అందజేశారు. అనంతపురంలోని కార్యాలయంలో ఎంపీని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం, ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాయలచెరువు రైల్వేస్టేషనలో ఆపకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు స్టాపింగ్‌ ఉండేవని, కరోనా సమయం నుంచి తొలగించారన్నారు. దీనిపై రైల్వే అధికారులకు ఇప్పటికే వినతిపత్రం అందజేశామని తెలిపారు. చొరవ తీసుకొని రైళ్లను ఆపేలా చూడాలని కోరారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 26 , 2026 | 11:54 PM