RTC: ఎలకి్ట్రకల్ బస్సులను ప్రైవేట్‌కు అప్పగించరాదు
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:52 PM
ఆర్టీసీలో ప్రవేశపెడు తున్న ఎలకి్ట్రకల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించరాదని ఆ ర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. గుంతకల్లు ఆర్టీసీ డిపో వద్ద బుధవారం రెండో రోజు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు.
- ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నాయకుల డిమాండ్
(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్), జూన 24: ఆర్టీసీలో ప్రవేశపెడు తున్న ఎలకి్ట్రకల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించరాదని ఆ ర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. గుంతకల్లు ఆర్టీసీ డిపో వద్ద బుధవారం రెండో రోజు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీని వెం టనే ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని, ఈహెచఎస్ నుంచి ఏపీ ఆర్టీసీని మినహాయించాలన్నారు. విద్యుత బస్సులను ఆర్టీసీ నడపాలన్నారు. స్త్రీ శక్తి బస్సుల రద్దీని తట్టుకోవడానికి అద నంగా నాలుగు వేల డిజిటల్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేయా లని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు ఎర్రిస్వామి, జోనల్ జా యింట్ సెక్రెటరీ లోకేష్‌కుమార్, రీజనల్ సభ్యులు మస్తాన, నాగసు ధ, డిపో అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, ఏఎల్‌ఎన గౌడ, కార్యదర్శులు మల్ల య్య, రమణ, నాయకులు రహంతుల్లా, గిరి తదితరులు పాల్గొన్నారు.
- అదేవిధంగా గుత్తి ఆర్టీసీ డిపో ఎదుట ఎర్రబ్యాడ్జీలు ధరించి గేట్ మీట్ నిర్వహించారు. జేఏసీ నాయకులు రామాంజినేయులు, ప్ర తాప్, నారాయణ, బీకే రాముడు, ఆంజనేయులు తదితరులు పా ల్గొన్నారు. ఉరవకొండ డిపో వద్ద చేపట్టిన నిరసనలో జేఏసీ నాయ కులు మాబు సాహెబ్, నారాయణస్వామి, వెంకటేశులు పాల్గొన్నారు. తాడిపత్రి ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలిపారు. నిరసనలో జేఏసీ ఉద్యోగులు ఆదినారాయణరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, రామకృష్ణ, ఆర్‌కెరెడ్డి, యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....