TA: మూకుమ్మడి డుమ్మా
ABN , Publish Date - May 19 , 2026 | 12:00 AM
స్థానిక మండల పరిషత కార్యాలయంలో సోమవారం జరగవలసిన ఉపాధిహామి పథకం పనులు పూర్తిగా స్తంభించాయి. టెక్నికల్ అసిస్టెంట్లు మూకుమ్మడిగా విధులకు డుమ్మా కొట్టడంతో కూలీల బిల్లులు, కొలతల ప్రక్రియ నిలిచిపోయింది.
యల్లనూరు, మే 18(ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత కార్యాలయంలో సోమవారం జరగవలసిన ఉపాధిహామి పథకం పనులు పూర్తిగా స్తంభించాయి. టెక్నికల్ అసిస్టెంట్లు మూకుమ్మడిగా విధులకు డుమ్మా కొట్టడంతో కూలీల బిల్లులు, కొలతల ప్రక్రియ నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలు దాటినా కూలీలకు సంబంధించిన బిల్లులు ఒ క్కటి కూడా నమోదు కాలేదు. పలు పంచాయతీల్లో సోమవారం కొలత లు తీయాల్సిన పనులు జరగలేదు. దీంతో వారం చివర అందాల్సిన కూలీ డబ్బులపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం జలధార కు సంబంధించి సమావేశం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు హాజరైనప్పటికి, టెక్నికల్ సిబ్బంది లేకపోవడంతో సమా వేశాన్ని వాయిదా వేశారు. ఉదయం నుంచి ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్ సిబ్బంది కనిపించకపోవడంపై అధి కారులు చర్చించుకుం టున్నారు. ఈ విషయంపై ఏపీడీ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, ఎంపీడీవో ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....