WORKS: రూ. 27 లక్షలతో తాగునీటి పనులు
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:50 PM
డి. హీరేహాళ్ మండలంలోని గ్రామా ల్లో తాగునీటి సమస్య పరిష్కారా నికి డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మొ త్తం రూ. 27 లక్షల వ్యయంతో ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో బోరు బావులు, పంపుసెట్లు, పై పులైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనట్లు ఆర్‌బబ్ల్యూఎస్ ఏఈ ధనుంజయ గౌడ్ తెలిపారు.
- ఆరు పంచాయతీల్లో బోర్లు, పంపుసెట్లు, పైపులైన్ల ఏర్పాటు
డి. హీరేహాళ్ (బొమ్మనహాళ్), జూన 18(ఆంధ్రజ్యోతి): డి. హీరేహాళ్ మండలంలోని గ్రామా ల్లో తాగునీటి సమస్య పరిష్కారా నికి డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మొ త్తం రూ. 27 లక్షల వ్యయంతో ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో బోరు బావులు, పంపుసెట్లు, పై పులైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనట్లు ఆర్‌బబ్ల్యూఎస్ ఏఈ ధనుంజయ గౌడ్ తెలిపారు. ఎం హనుమాపు రం పంచాయతీకి రూ. 5 లక్షలు, మురడి పంచా యతీ పరిధిలోని తమ్మేపల్లికి రూ. 3.50 లక్షలు, మురడికి రూ. 5 లక్షలు, చెర్లపల్లికి రూ. 3. 50 లక్షలు, కదూలూరుకు రూ. 5 లక్షలు, మల్పనగుడి గ్రామానికి రూ. 5 లక్షలు మంజూరైనట్లు ఆయన వివరించారు. ఈ నిధులతో బోరు బావులు, పంప్‌సెట్లు, పైపులైన్లు ఏర్పాటు చేసి, తాగునీటి సరఫరాను మెరుగుపరిచినట్లు తెలిపారు. అయితే కదూలూరులో పైపులైన ఏర్పాటు ఇంకా పెండింగ్‌లో ఉందని, త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ పనుల ద్వారా అయా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని అధికా రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....