Share News

TANK: కలుషితమవుతున్న తాగునీటి చెరువు

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:39 PM

మండల కేంద్రంలోని ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ కా ర్యాలయ ప్రాంగణంలోను, ఫిల్టర్‌ బెడ్ల వద్ద మద్యం బాబులు రోజూ హంగామా చేస్తున్నారు. విచ్చల విడిగా మద్యం తాగు తూ చెరువు మొత్తాన్ని కలుషితం చేస్తున్నారు. 11 గ్రామాలకు తాగు నీ రు అందించే ట్యాంక్‌ వద్ద వివిధ గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు కర్ణాటక, ఆంధ్ర మద్యం తెచ్చుకుని తాగి హంగామా చేస్తున్నారు.

TANK: కలుషితమవుతున్న తాగునీటి చెరువు
An area filled with sachets of illicit liquor.

- మద్యం బాటిళ్లు, వ్యర్థాలను అక్కడే వదిలేస్తున్న మందుబాబులు

- పట్టించుకోని అధికారులు

విడపనకల్లు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ కా ర్యాలయ ప్రాంగణంలోను, ఫిల్టర్‌ బెడ్ల వద్ద మద్యం బాబులు రోజూ హంగామా చేస్తున్నారు. విచ్చల విడిగా మద్యం తాగు తూ చెరువు మొత్తాన్ని కలుషితం చేస్తున్నారు. 11 గ్రామాలకు తాగు నీ రు అందించే ట్యాంక్‌ వద్ద వివిధ గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు కర్ణాటక, ఆంధ్ర మద్యం తెచ్చుకుని తాగి హంగామా చేస్తున్నారు. చెరువు ప్రాంగణంలో డిన్నర్లు ఏర్పాటు చేసుకుంటు న్నారు. మద్యంతాగి తాగి, ఖాళీ చేసిన మద్యం బాటిళ్లను ఫిల్టర్‌ బెడ్‌లోకి కూడా వేసి వెళ్తున్నారు. దీంతో ఎక్కడి పడితే అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు, వాటర్‌ పాకెట్లు కుప్పలు, కు ప్పలుగా పడి ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోకపోవడం దారు ణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువు వద్ద రోజూ 15 మంది సిబ్బం ది ఉన్నా తమకేమీ పట్టనట్టుగా వెళ్లి పోతున్నారని స్థాని కులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చెరువు కట్టపై ముళ్ల పొదలు పెరిగి మనుషులు కట్టపైకి వెళ్లలేని పరిస్థితి ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఫిల్టర్‌ బెడ్లు ఐదు ఉండగా మూడు పూర్తిగా పాడై పోయాయి. మిగిలిన రెండు అంతంత మాత్రంగా పని చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో పనిచేయని వీటి ద్వారానే తాగు నీరు పలు గ్రామాలకు అందిస్తున్నారు. దీనికి తోడు మద్యం బాబులు తాగి పడేసిన ఖాళీ మద్యం బాటిళ్లు, పా ్లస్టిక్‌ కవర్లుతో ఫిల్టర్‌ బెడ్లు నిండి మరింత కలుషితం అవుతున్నాయి. వా టిని తొలగించకుండానే గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ఫిల్టర్‌ బెడ్లలోని నీరు పాచి పట్టినా శుభ్రం చేయడం లేదు. ఇలా ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ పూర్తిగా కలుషితం అవుతున్నా అధికారులు పట్టించుకోకపో వడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీరు కలుషితం కాకుండా, ఆ ప్రాంతంలో శుభ్రతను పాటించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- ఈ విషయమై ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ ముజామిల్‌ను వివరణ కోరగా మద్యం ప్రియులపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా వారెవరూ పద్ధతి మార్చుకోలేదని తెలిపారు. సిబ్బందిని కాపలాగా పెట్టి చెరువులోకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యర్థాలను తొలగించి చెరువును శుభ్రంగా ఉంచుతామని తెలిపారు.

Updated Date - Sep 02 , 2026 | 11:39 PM