Share News

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:04 AM

డి. హీరేహాళ్‌ మం డలంలోని కుడ్లూరు, గొడిసెలపల్లి మధ్య ఉన్న తాగునీటి పైపులైనలో లీకేజీ ఏర్ప డింది. విలువైన తాగునీరు వృథా అవు తోంది. పైపులైన హెయిర్‌ వాల్వ్‌ వద్ద నుం చి నీరు ఉబికి బయటకు వస్తోంది. సమీప బీడు భూముల్లోకి చేరి నిల్వ ఉంటోంది. తాగునీరు వృథాగా బయటకు పో తుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

WATER: పైపులైన లీకేజీతో తాగునీరు వృథా
Water coming out in vain near Kudlur

డి. హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌), ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): డి. హీరేహాళ్‌ మం డలంలోని కుడ్లూరు, గొడిసెలపల్లి మధ్య ఉన్న తాగునీటి పైపులైనలో లీకేజీ ఏర్ప డింది. విలువైన తాగునీరు వృథా అవు తోంది. పైపులైన హెయిర్‌ వాల్వ్‌ వద్ద నుం చి నీరు ఉబికి బయటకు వస్తోంది. సమీప బీడు భూముల్లోకి చేరి నిల్వ ఉంటోంది. తాగునీరు వృథాగా బయటకు పో తుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మండలంలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఇలా తాగునీరు వృథా కావడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారు లు స్పందించి పైపులైన లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Apr 23 , 2026 | 12:04 AM