WATER: వంకల్లోకి తాగునీరు
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:00 AM
పీఏబీఆర్ డ్యాం నుంచి అనంతపురం నగరానికి సరఫరా అయ్యే తాగునీరు కూడేరు మండలంలోని వివిధ ప్రదేశాల్లో వృథాగా వంకల్లోకి వెళ్తోంది.
కూడేరు, జూన 3 (ఆంధ్రజ్యోతి): పీఏబీఆర్ డ్యాం నుంచి అనంతపురం నగరానికి సరఫరా అయ్యే తాగునీరు కూడేరు మండలంలోని వివిధ ప్రదేశాల్లో వృథాగా వంకల్లోకి వెళ్తోంది. పైప్‌లైన లీకేజీలతో నీరు వృథాకావడమే కాకుండా, శుద్ధి చేసిన నీరు ఆయా ప్రదేశాల్లో బయట నీటితో కలిసి కలుషితం అవుతోంది. మండలంలోని అరవకూరు, గొ ట్కూరు, కమ్మూరు తదితర ప్రదేశాల్లో లీకేజీల ద్వారా నీరు వృథాగా బయటకు వెళ్తోంది. అయినా అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదనలు వినవస్తున్నాయి. ఇప్పటికైన శు ద్ది చేసిన నీరు వృథా కాకుండా చూడాలని ప్రజలు అంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....